సుశాంత్ సింగ్ 50 కలలు.. ఎన్ని తీరాంటే ?
‘కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి’ అబ్దుల్ కలాం చెప్పిన ఈ మాట ఎందరికో ఆదర్శం. ఆచరనీయం. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా చాలానే కలలు కన్నారు. దాదాపు 50 కలలు కన్నారు. వాటిని ఆరు పేజీలుగా రాసుకొన్నారు. వాటిని తన ట్విట్టర్ ఖాతాలో వివిధ సందర్భాల్లో షేర్ చేశారు. వాటిలో కొన్ని తీర్చుకున్నారు. వాటికి సంబంధించిన వీడియోలని అభిమానులతో పంచుకున్నారు. సుశాంత్ కలలు ఒక్క రంగానికి పరిమితం కాలేదు. సినిమా, క్రికెట్, సైన్స్, స్పెస్.. ఇలా అన్నీ రంగాల్లో ఆయన కలలు కన్నారు. వాటిని నెరవేర్చుకొనే ప్రయత్నం చేశారు. అయితే అన్నీ కోరికలు, కలలు తీరడకుండానే ఈలోకాన్ని వదిలి వెళ్లిపోయారు.
సుశాంత్ రాసుకున్న కలల్లు పేజీల వారీగా :
సుశాంత్ కలలు పేజ్ – 1:
* ఒక విమానాన్ని నడపడం నేర్చుకోవడం
* రెండో కల ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్‌కు సిద్ధం కావడం. ఇందులో ఒక వ్యక్తి ఒక్క రోజులోనే 2.4 మైళ్లు స్విమ్మింగ్, 112 మైళ్లు సైకిల్ రైడింగ్, 26.22 మైళ్లు పరుగుపందెంలో పాల్గొనాల్సి ఉంటుంది. మూడు పందేలకూ నిర్ణీత సమయం ఉంటుంది. ఈ మూడింటిలో గెలుపొందిన వారికి ఐరన్ మ్యాన్ టైటిల్ ఇస్తారు.
* సుశాంత్ సింగ్ మూడో కల ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడటం
* నాలుగో కల మోర్సె కోడ్ నేర్చుకోవడం. ఈ కోడ్‌ను టెలీకమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తుంటారు.
* ఐదో కల చిన్నారులు అంతరిక్షం గురించి తెలుసుకునేందుకు సహాయం చేయడం
* ఒక టెన్నిస్ ఛాంపియన్ పాత్రలో నటించడం
* నాలుగు క్లాప్ పుషప్‌లు చేయడం
My 50 DREAMS & counting…! 😉
————————
1. Learn how to Fly a Plane ✈️ 2. Train for IronMan triathlon 🏃🏻♂️
3. Play a Cricket Match left-handed 🏏
4. Learn Morse Code _.. 5. Help kids learn about Space. 🌌
6. Play tennis with a Champion 🎾
7. Do a Four Clap 👏 Push-Up ! (1/6) … pic.twitter.com/8HDqlTNmb6— Sushant Singh Rajput (@itsSSR) September 14, 2019
సుశాంత్ కలలు – రెండో పేజ్
* ఒక వారం రోజుల పాటు చంద్రుడు, అంగాకరుడు, బృహస్పతి, శని గ్రహాలను పర్యవేక్షించడం
* ఒక బ్లూ హోల్లో ఈత కొట్టడం. సముద్రాల్లోని దీవుల్లో నీలం రంగులో ఉండే గుహలను బ్లూహోల్ అంటారు
* ఒకసారి డబుల్ స్లిట్ ప్రయోగం చేసేందుకు ప్రయత్నించడం. కాంతి, పదార్థాలను వివరించేదే ఈ భౌతిక శాస్త్ర ప్రయోగం
* కొన్ని వేల మొక్కలు నాటాలి
* ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీని సందర్శించడం. ఇది అతడు ఇంజనీరింగ్ పూర్తి చేసిన కాలేజ్
* ఇస్రో లేదా నాసా వర్క్‌షాపుకు వంద మంది పిల్లల్ని పంపించడం
* కైలాశ్ (పర్వతం)పై ధ్యానం చేయడం
8. Chart trajectories of Moon, Mars, Jupiter & Saturn for a week
9. Dive in a Blue-hole
10. Perform the Double-Slit experiment
11. Plant 1000 Trees
12. Spend an evening in my Delhi College of Engineering hostel
13. Send 💯 KIDS for workshops in ISRO/ NASA
14. Meditate in Kailసుశాంత్ సింగ్ కలలు – మూడో పేజ్
ash pic.twitter.com/x4jVGp4UJS
— Sushant Singh Rajput (@itsSSR) September 14, 2019
సుశాంత్ సింగ్ కలలు – మూడో పేజ్
* ఒక ఛాంపియన్‌తో పోకర్ (పేకాట) ఆడటం
* ఒక పుస్తకం రాయడం
* యురోపియన్ న్యూక్లియర్ రీసెర్చి సంస్థ అయిన సీఈఆర్ఎన్ను సందర్శించడం
* పోలార్ లైట్స్, నార్తరన్ లైట్స్, సదరన్ లైట్స్‌గా పేరొందిన ఆరోరాను చూస్తూ పెయింటింగ్ వేయడం
* నాసాలో మరొక వర్క్‌షాపుకు హాజరు కావడం
* ఆరు నెలల్లోనే సిక్స్ ప్యాక్స్ శరీరాన్ని పొందడం
* సెనోట్ (సున్నపురాయి భూమి కుంగిపోవడంతో సహజంగా ఏర్పడిన నీటి కొలను)లో ఈదడం
* చూపులేని వారికి కోడింగ్ నేర్పించడం
* అడవిలో ఒక వారం రోజుల పాటు గడపడం
* వైదిక జ్యోతిష్య శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం
* డిస్నీలాండ్‌కి వెళ్లడం
ఇలా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కలలు 50వరకు ఉన్నాయి. వాటిని 4, 5, 6 పేజీలుగా రాసుకొన్నారు. వాటిన్నింటిని ఒకేదగ్గర చూద్దాం.
* అమెరికాలోని లిగో (లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ)ని సందర్శించడం
* ఒక గుర్రాన్ని పెంచుకోవడం
* కనీసం పది నాట్య రీతుల్ని నేర్చుకోవడం
* ఉచిత విద్య కోసం పనిచేయడం
* అండ్రొమేడా అనే పాలపుంతను ఒక శక్తివంతమైన టెలిస్కోప్ సాయంతో పరిశీలించడం
* క్రియా యోగను నేర్చుకోవడం
* మంచుతో నిండిపోయిన అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడం
* మహిళలు స్వీయ రక్షణ నైపుణ్యాలు నేర్చుకునేలా సహాయం చేయడం
* నిప్పులు చిందే ఒక అగ్నిపర్వతాన్ని చిత్రీకరించడం
* వ్యవసాయం నేర్చుకోవడం
* పిల్లలకు డాన్స్ నేర్పించడం
* రెండు చేతులతో బాణాలు వేసేలా శిక్షణ పొందాలి
* రెస్నిక్ హల్లిడే రచించిన ఫిజిక్స్ పుస్తకం మొత్తాన్ని చదవాలి
* పాలినేసియన్ ఆస్ట్రానమీని అర్థం చేసుకోవడం
* తన ఫేవరెట్ 50 పాటలకు గిటార్ నేర్చుకోవడం
* ఒక ఛాంపియన్‌తో చెస్ ఆడటం
* లాంబోర్గిని కారును సొంతం చేసుకోవడం
* వియన్నాలోని సెయింట్ స్టీఫెన్స్ కేథడ్రల్ చర్చిని సందర్శించడం
* సైమాటిక్స్ ప్రయోగాలు చేయడం
* భారత సైన్యంలో చేరేలా విద్యార్థులు సిద్ధమయ్యేందుకు సహాయం చేయడం
* సముద్ర అలలపై సర్ఫింగ్ చేయడం
* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎక్స్‌పోనేషియల్ టెక్నాలజీలపై పని చేయడం
* కపోరియా ను నేర్చుకోవడం
* యూరప్ మొత్తం రైలులో ప్రయాణించడం
వీటిలో కొన్ని కలలని సుశాంత్ నెరవేర్చుకున్నారు. ఇంకొన్ని తీరకుండానే ఈలోకాన్ని వదిలివెళ్లిపోయారు.
Dream 1/50
Learn to Fly. ✈️ #livingMyDreams #lovingMyDreams pic.twitter.com/TPvbPDWd99— Sushant Singh Rajput (@itsSSR) September 26, 2019
Dream 1/50
Learn to Fly. ✈️ #livingMyDreams #lovingMyDreams pic.twitter.com/TPvbPDWd99— Sushant Singh Rajput (@itsSSR) September 26, 2019
Live Soon.:)🕺🏾
—— Dream 3/50 ——
Play a Cricket match left handed. 🏏 #livingmydreams 🌈#lovingmydreams ✨ pic.twitter.com/RyRdG5cA3m— Sushant Singh Rajput (@itsSSR) October 10, 2019
Live Soon.:)🕺🏾
—— Dream 3/50 ——
Play a Cricket match left handed. 🏏 #livingmydreams 🌈#lovingmydreams ✨ pic.twitter.com/RyRdG5cA3m— Sushant Singh Rajput (@itsSSR) October 10, 2019
Spend a day at The Large Hadron Collider, CERN. 💥
Dream 17/50 #livingMyDreams#lovingMyDreams pic.twitter.com/jinOYG6L0Q— Sushant Singh Rajput (@itsSSR) September 25, 2019