ప్రయివేటు చేతుల్లోకి కరోనా చికిత్స.. రేట్లు ఎంతంటే ?
ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా చికిత్సకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా చికిత్సలకి సంబంధించిన ధరలని మంత్రి ఈటెల రాజేందర్ మీడియాకు తెలిపారు. కోఠి కమాండ్ సెంటర్లో ఈటల మీడియాతో మాట్లాడారు.
* ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర : రూ.2,200
* వెంటిలేటర్‌పై లేకుండా ఐసీయూలో ఉంచితే రూ.7,500
* వెంటిలేటర్‌పై ఉంటే రోజుకు రూ.9 వేలుగా నిర్ణయించారు.
కరోనా లక్షణాలు లేని వాళ్లకు పరీక్షలు చేయరు. లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేయాలని మార్గదర్శకాలు ఇస్తున్నామన్నారు మంత్రి ఈటెల. తెలంగాణలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ చెప్పింది. మనం తీసుకునే చర్యలు బాగున్నాయని కూడా కితాబిచ్చింది. ఐసీఎంఆర్ నిబంధనలు పూర్తిగా పాటిస్తున్నామని మంత్రి తెలిపారు.