‘లవ్ స్టోరీ’ రిలీజ్ ఎప్పుడంటే ?

కరోనా లాక్‌డౌన్ షూటింగ్ లకి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ లకి ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే.. మళ్లీ సందడి మొదలవ్వనుంది. వెంటనే సినిమాలని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని భావించారు. కానీ షూటింగ్ లకి అనుమతులు వచ్చినా.. తొందరపడి ఎవరు షూటింగ్స్ ని మొదలుపెట్టడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ లని నిర్వహించడం కష్టమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాల రిలీజ్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. మే నెలలోని లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు షూటింగ్ లకి అనుమతులు లభించినా.. ఇప్పటికిప్పుడే షూటింగ్స్ మొదలెట్టాలనే ఆలోచనలో శేఖర్ కమ్ముల లేనట్టు తెలుస్తోంది. మిగిలి ఉన్నది కొద్దిమేర షూటింగ్ నే కాబట్టి.. తాపీగా పూర్తి చేసి.. దసరా లేదంటే డిసెంబర్ లో లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్ లో శేఖర్ కమ్ముల ఉన్నట్టు సమాచారమ్.