సింపుల్ గా సీఎం కూతురు పెళ్లి

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కుమార్తె వీణా తయిక్కండియిల్ వివాహం చాలా సింపుల్ గా జరిగింది. ఆమె డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా(డీవైఎఫ్ఐ) జాతీయ అధ్యక్షుడు పీఏ ముహమ్మద్‌ రియాస్ ని పెళ్లాడింది. తిరువనంతపురంలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ పెళ్లివేడుక జరిగింది.

ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. వాటిలో తాళి కట్టు సన్నివేశాన్ని బంధువులంతా సంతోషంగా వీక్షిస్తున్నారు. వీణా బెంగళూరులో ఐటీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వరుడు రియాస్‌ విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన గతంలో డీవైఎఫ్ఐ జాతీయ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. డీవైఎఫ్ఐ..సీపీఎం యువజన విభాగం.