నాని లవర్’ని మెగా హీరోలు వాడేసుకొంటున్నారు !

నాని ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయింది పంజాబీ బ్యూటీ మెహ్రీన్. ఇప్పుడీ హీరోయిన్ బీజీ అయిపోయింది. ఇటీవల కాలంలో ఆమె నటించిన సినిమాలు క్యూ కట్టాయి. రాజా ది గ్రేట్, మహానుభావుడు, జవాన్ సినిమాలతో సందడి చేసింది. ఇవీగాక మెహ్రీన్ చేతిలో అరడజను తెలుగు సినిమాలు ఉన్నాయి. తాజాగా, వెంకీ-వరుణ్ తేజులతో అనిల్ రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఎఫ్2’ కోసం మెహ్రీన్ ని తీసుకొన్నారు.

ఈ సినిమాలో మెహ్రీన్ వరుణ్ తేజుకి జంటగా నటించనుంది. గత యేడాది మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజు ‘జవాన్’లో నటించింది మెహ్రీన్. ఇప్పుడు మరో యంగ్ హెరో వరుణ్ తేజుతో రొమాన్స్ చేయనుంది. మెగా హీరోలకి ఓ అలవాటు ఉంది. ఒకరి ప్రక్కన నటించిన హీరోయిన్ ఆ తర్వాత వరుసపెట్టి వాడేసుకొంటారు. రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో అదే జరిగింది. ఇప్పుడు మెహ్రీన్ ని వాడటం మొదలెట్టారు మెగా హీరోలు. మరీ.. రకుల్ మాదిరిగా మెహ్రీన్ కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదుగుతుందా ? లేదా ? అనేది చూడాలి.