సుశాంత్ మృతిపై అమితాబ్ ఆవేధన

గ్రూప్‌ డ్యాన్సర్‌లలో నాలుగో స్థానం డ్యాన్సర్‌గా జీవితం ప్రారంభించిన సుశాంత్‌, కథానాయకుడిగా ఎదిగిన తీరు చూస్తుంటే అంతా ఒక నాటకం చూసినట్లే అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు బిగ్ అమితాబ్. సినీ ప్రపంచంలో త్వరగా పైకి ఎదిగిన సుశాంత్‌ అంతే త్వరగా వెళ్లిపోవడం బాధాకరమన్నారు.

“ఎందుకు.. ఎందుకు.. ఎందుకు..సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఎందుకు నీ జీవితాన్ని త్యజించావు. నిన్ను నీవు ప్రశ్నించుకోకుండా, అడగకుండా నీ అద్భుతమై ప్రతిభను, మేథాశక్తిని ఎందుకు పక్కన పెట్టావు” అని ప్రశ్నించారు అమితాబ్.

“అతని పనితీరు అద్భుతం. ఒకసారి అతను నన్ను కలిసినప్పుడు అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ధోని కొట్టిన విన్నింగ్‌ సిక్స్‌ను వెండితెరపై అదేవిధంగా ఎలా కొట్టగలిగావు’ అని అడిగాను ‘ధోని సిక్స్‌ కొట్టిన ఆ వీడియోను వందలసార్లు చూశాను’ అని అతను నాతో చెప్పాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు వృత్తి పట్ల అతనికున్న నిబద్ధత తెలియజేయడానికి” అని అమితాబ్‌ రాసుకొచ్చారు.