రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా బడ్జెట్ : చంద్రబాబు

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో వరుసగా రెండో సారి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.2.24లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ ని ప్రవేశపెట్టారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చూశామని ఆర్థిక మంత్రి తెలిపారు. అయితే ఈ బడ్జెట్ పై ప్రతిపక్షాలు పెదవి విరిచారు.

అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో దీనిపై చంద్రబాబు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ”కరోనా నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా దృష్టిపెట్టలేదు. సీఎం నుంచి ఎవరూ మాస్కులు పెట్టుకోవాలనే ఆలోచన లేకుండా ప్రవర్తించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా రెండో బడ్జెట్‌ ఉంది. ఈ సభ ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చారు. బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు కరోనాను పూర్తిగా విస్మరించి ప్రవర్తించారు” అని మండిపడ్డారు. పదో తరగతి పరీక్షలని రద్దు చేయాలని ఈ సందర్భంగా బాబు డిమాండ్ చేశారు.