రఘు రామకృష్ణరాజు ఇక వైకాపాని వీడినట్టే.. !
వైసీపీ ఎంపీల సంఖ్య తగ్గనుంది. ఆ పార్టీ ఎంపీ రఘు రామకృష్ణరాజు పార్టీ వీడేలా కనిపిస్తున్నాడు. ‘మా చిన్న కులంలో చిచ్చుపెట్టొద్దు’ అంటూ రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై పశ్చిమ గోదావరి నేతలు భగ్గుమన్నారు. మంగళవారం ఉదయం ప. గో నేతలు సీఎం జగన్ ని కలిశారు. ఎంపీ రఘు రామకృష్ణరాజు వ్యవహారంపై చర్చించారు. ఆ తర్వాత ఆయనపై ఎటాక్ చేశారు. అయితే, రఘు రామకృష్ణరాజు కూడా ఏం తగ్గలేదు.
వైకాపా నేతల తీరుపై ఆయన మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ‘పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ కొట్టారు. నన్ను విమర్శించిన వాళ్లు జగన్ బొమ్మ పెట్టుకొని గెలిచి చూపించాలి. మా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో నాపై తిట్ల పర్వం కొనసాగించారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఓ ఇసుక బ్రోకర్. ఇళ్ల స్థలాల్లోనూ ఆయన రూ.కోట్లు దండుకున్నారు. సత్యనారాయణ అరాచకాల గురించి ఆయన మేనల్లుడే చెబుతారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు పైనా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు.
ఇంత జరిగినా ఎంపీ రఘు రామకృష్ణరాజు వైసీపీలో కొనసాగే అవకాశాల్లేవని తెలుస్తోంది. ఆయన భాజాపా వైపు చూస్తున్నారు. త్వరలోనే ఆయన భాజాపాలో చేరబోతున్నట్టు సమాచారమ్.