యాంకర్ ప్రదీప్’కు 2రోజుల జైలు శిక్ష !

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిపోయిన యాంకర్ ప్రదీప్’కు కనీసం రెండు రోజుల జైలు శిక్ష పడటం ఖాయమని చెబుతున్నారు. ఈ కేసులో ప్రదీప్ మంగళవారం కౌన్సెలింగ్’కు కూడా హాజరుకాలేదు. ఈ విషయాన్ని కూడా పోలీసులు ఛార్జీషీటులో పేర్కొననున్నారు. వాస్తవానికి ప్రదీప్ కు కౌన్సెలింగ్’కు హాజరయ్యేందుకు శనివారం వరకు అవకాశం ఉంది. ఐతే, ఇటీవల కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారికి కేవలం రెండ్రోజుల్లోనే కౌన్సెలింగ్ పూర్తి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రదీప్ ని కౌన్సెలింగ్ కు తీసుకొచ్చేందుకు ఇద్దరు కానిస్టేబుల్స్ ని పంపామని కోసం ప్రదీప్ దగ్గరు బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ బలవంతయ్య తెలిపారు. ఐతే, ఆయన అందుబాటులో లేరు. ఆ విషయాన్ని ఛార్జ్ షీటులో పేర్కొన్నామని చెబుతున్నారు. కాగా, బ్రీత్ అనలైజర్ టెస్టులో ప్రదీప్ కు 178 రీడింగ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రదీప్ కు కనీసం రెండు రోజుల జైలుశిక్ష పడటం ఖాయమని చెబుతున్నారు.

మరోవైపు, ప్రదీప్ పై నెటిజర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని వీడియోలు, టీవీల్లో దంచికొట్టే ఆయన.. ఇలా బుద్దిలేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తునారు. ఇదీగాక, ఈ కేసులో కౌన్సెలింగ్’కు హాజరు కాకుండా జాప్యం చేయడాన్ని విమర్శిస్తున్నారు.