ఆ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు జంప్ ?
రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ డబుల్ షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి వర్ల రామయ్యకు కేవలం 17 ఓట్లు మాత్రమే వచ్చాయ్. వర్ల ఓటమి ఖాయమన్నది ముందే తెలిసిన విషయం. బలం లేకుండా తెదేపా రాజ్యసభ బరిలో నిలిచింది. తెదేపా కేవలం 23మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయినా.. వర్ల రామయ్యని బరిలోకి దించి రాజ్యసభ ఎన్నికల్లోరాజకీయం చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు. కానీ ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదు. వర్ల రామయ్య ఓటమిపాలయ్యారు. దీంతో పాటు ఊహించని షాక్ తగిలింది.
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో మొత్తం 173 ఓట్లు పోలయ్యాయ్. అయితే నాలుగు తెదేపా ఎమ్మెల్యేలు చెల్లని ఓట్లు వేశారు. దీని వెనక వేరే రాజకీయం ఉంది. ఈ నలుగురు తెదేపాని వీడేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారమ్. ఇప్పటికే ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాళి గిరి తెదేపా నుంచి బయటికొచ్చారు. వీరిద్దరు వైసీపీలో చేరకుండా ప్రత్యేకమైన ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వీరికి తోడు మరో నలుగురు ఎమ్మెల్యేలు తెదేపాని వీడటానికి రెడీగా ఉన్నట్టు తాజా రాజ్యసభ ఎన్నికలతో తేలిపోయిందని చెప్పుకొంటున్నారు.