రివ్యూ : పెంగ్విన్
చిత్రం : పెంగ్విన్ (2020)
నటీనటులు : కీర్తి సురేష్, ఆదిదేవ్, లింగ, అద్వైత్, హరిణి, నిత్య తదితరులు
సంగీతం : సంతోష్ నారాయణ్
దర్శకత్వం : ఈశ్వర్ కార్తీక్
నిర్మాతలు : కార్తీక్ సుబ్బరాజ్, కార్తికేయన్ సంతానం
రిలీజ్ డేట్ : 19జూన్, 2020.
విడుదల : అమెజాన్ ప్రైమ్
కరోనా లాక్డౌన్ తో థియేటర్స్ బంద్ అయ్యాయ్. ప్రేక్షకులకి ఎంటర్ టైన్ మెంట్ కరువైంది. ఈ గ్యాప్ లో జనాలు డిజిటల్ ఫార్మెట్ కి అలవాటయ్యారు. దీంతో.. సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయ్. ఇప్పటికే మూడ్నాలుగు సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయ్. తాజాగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘పెంగ్విన్’ అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది. మరీ.. పెంగ్విన్ ఎలా ఉంది ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంది ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
రిథమ్ (కీర్తి సురేష్), రఘు (లింగ) భార్యభర్తలు. వీరికి ఒక్కగానొక్క కొడుకు అజయ్ (మాస్టర్ అద్వైత్). అల్లారుముద్దుగా పెంచుకుంటున్న అజయ్ కిడ్నాప్ కి గురవుతాడు. అది రిథమ్ నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని రిథమ్ కి విడాకులిస్తాడు రఘు. అయినా రిథమ్ తన కొడుకు బతికే ఉన్నాడని నమ్ముతుంది. కొడుకు కోసం వెతుకుతూనే ఉంతుంది. ఈ సమయంలో గౌతమ్ (రంగరాజన్)ని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారభిస్తుంది. అయినా.. అజయ్ జ్ఝాపకాలని నుంచి బయటికి రాలేకపోతుంటుంది. నిజంగా అజయ్ బతికే ఉన్నాడా ? ఉంటే.. అతడిని ఎవరు కిడ్నాప్ చేశారు ? ఎందుకు ?? అనేది పెంగ్విన్ కథ.
ఎలా ఉందంటే ?
దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ ప్రేక్షకులని నేరుగా కథలోకి తీసుకెళ్లారు. అజయ్ కిడ్నాప్ తో హారర్ థ్రిల్లర్ ని చూడబోతున్నామనే క్లారిటీని ప్రేక్షకులకి మొదట్లోనే ఇచ్చేశాడు. అజయ్ కిడ్నాప్ అవ్వడం, ఆయన కోసం రిథమ్ పడిన తపన, అజయ్ కిడ్నాప్ చేసినట్టు అందరి మీద అనుమానం వచ్చేలా కథని గ్రిప్పింగ్ గా నడిపించారు. అజయ్ తో పాటు మరో ఆరుగురు పిల్లలు కిడ్నాప్ కి గురవుతారు.
ఈ నేపథ్యంలో పిల్లలని కిడ్నాప్ చేసిన ముఠా గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిపించారు. ఆ మూడులోనే కథని ముందుకు తీసుకెళ్లాడు. కిడ్నాప్ ముఠాకి సంబంధించిన చిక్కుముడులని విప్పితూ.. ముందుకెళ్లాడు. అయితే ఆరుగిరిని కిడ్నాప్ చేసిన ముఠా అజయ్ ని కిడ్నాప్ చేయలేదని చెప్పడంతో కథలో కొద్దిగా జోరు తగ్గినట్టు అనిపించింది.
ఎవరెలా చేశారు ?
పెంగ్విన్.. కీర్తి సురేష్ వన్ ఉమెన్ షో అని చెప్పాలి. ఆమె నటన హైలైట్. కథ మొత్తం కీర్తి చుట్టునే తిరుగుతోంది. తల్లిగా, నిండి గర్భిణిగా రిథమ్ పాత్రలో ఒదిగిపోయారు. కనబడకుండా పోయిన బిడ్డ కోసం తపనపడే తల్లి పాత్రలో బాగా నటించారు. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా :
థ్రిల్లర్ సినిమాలకి నేపథ్య సంగీతమే ప్రధాన బలం. సంతోష్ నారాయణ మంచి నేపథ్య సంగీతం అందించారు. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ బాగుంది. కొడైకెనాల్ అందాలని బాగా చూపించారు. సస్పెన్స్ సీన్స్ ని ఇంకా బాగా చూపించారు. ఈశ్వర్ కార్తీక్ రాసుకున్న కథ కొత్తదేమీ కాదు. కానీ కథనం ఆకట్టుకుంది. గ్రిప్పింగ్ స్కీన్ ప్లేతో సినిమాని అద్భుతంగా నడిపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
* స్క్రీన్ ప్లే
* కీర్తి సురేష్
* నేపథ్య సంగీతం
* సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
* సెకాంఢాఫ్ కొన్ని సన్నివేశాలు
* క్లైమాక్స్