ఈ మంటలు తగ్గేదెప్పుడో.. !

కరోనా భయంతో ప్రజలు వణికిపోతున్నారు. పనిలేక.. తినడానికి తిండిలేక పేదలు తల్లిడిల్లిపోతున్నారు. ఈ ఆపద సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకి అండగా నిలిచినట్టే నిలిచాయ్. రేషన్ బియ్యం, నగదుని అందించాయి. అయితే ఆ తర్వాత మాత్రం పేదల నడ్డివిరిచే పనులు చేస్తున్నాయ్ ప్రభుత్వాలు. కరోనా టైమ్ లో వచ్చిన కరెంట్ బిల్లులు చూసి.. పేదోడికి కళ్లు తిరుగుతున్నాయి. మరోవైపు పెట్రో ధరలు నాన్ స్టాప్ గా పెరుగుతున్నాయి. ఏకంగా 14 రోజుల పాటు పెట్రో ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి.

శనివారం పెట్రోల్‌పై 51 పైసలు, డీజిల్‌పై 61 పైసలు చొప్పున ధర పెరిగింది. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.78.88, డీజిల్‌ లీటరు ధర 77.67కి ఎగబాకింది. వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవడంతో ధరల్లో ఆమేరకు వ్యత్యాసం కనిపించనుంది. ఈ నెల 7 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.7.62, డీజిల్‌పై రూ.8.28 పైసలు పెరిగింది. ఈ పెట్రో మంటలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. పెట్రో ధరల ప్రభావంతో నిత్యవసర వస్తువుల ధరలకి రెక్కలు రానున్నాయి.