తీన్మార్ మల్లన్నపై పోలీస్ కేసు
తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు స్టేషన్లో కేసు నమోదైంది. మల్లన్న ‘క్యూ న్యూస్’ పేరిట యూట్యూబ్ ఛానెల్ ని నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఛానెల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. కొన్నిసార్లు మల్లన్న ఆరోపణలు శృతి మించుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
తాజాగా సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పోలీస్ ఉన్నతాధికారులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తీన్మార్ మల్లన్నపై జూబ్లీహిల్స్ పోలీసులు స్టేషన్లో కేసు నమోదైంది. యూసుఫ్ గూడ కార్మిక నగర్లో నివాసం ఉంటున్న సయ్యద్ మెయిన్ అనే విద్యార్థి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 504, 505(1)(సీ), 505 (2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.