గజల్స్’కు పొలిటికల్ సపోర్టు.. !

లైంగిక వేధింపుల కేసులో అరెస్టై రిమాండ్’లో ఉన్న సింగ‌ర్ గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ పై రోజుకో వీడియో బ‌య‌ట‌కొస్తోంది. మ‌రింత మంది బాధితులు వెలుగులోకి వ‌స్తున్నారు. ఈ నేపథ్యంలో గజల్స్ గలీజ్ పనుల లిస్టు పెద్దదిగానే ఉండబోతుందని, ఈ కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు బయటికొచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఐతే, గజల్స్ కు తొలి సపోర్టు లభించింది. అది కూడా పొలిటికల్ సైడ్ నుంచి కావడం విశేషం.

గలీజ్ పని చేసిన గజల్ శ్రీనివాసును ఏపీ మంత్రి మాణిక్యాల‌రావు వెన‌కేసుకొచ్చారు. గ‌జల్ శ్రీనివాసు ఏపీసోడులో కుట్ర కోణం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. గజల్ త‌న‌కు చిన్నప్పట్నుంచి తెలుసని, చాలా చక్కటి, కమ్మటి పాటలను పాడతారని మంత్రి మాణిక్యాల‌రావు అన్నారు. దేశ వ్యాప్తంగా తిరిగి చక్కటి గజల్స్ వినిపించారని, అమ్మాయిలను వేధించే నైజం గజల్ శ్రీనివాసుది కాదన్నారు మంత్రి. కుట్ర లేకుంటే కెమెరాలు ఎందుకు పెట్టారంటూ మంత్రి ఆయ‌న ప్ర‌శ్నించారు.

గజల్స్ ని మంత్రి వెనకేసుకు రావడం వెనక మరో అనుమానం కూడా తలెత్తుతోంది. అదేటంటే.. ? ఏపీ ప్రభుత్వం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో గజల్ కీలక పాత్ర వహించేవారు. ఏపీ ప్రభుత్వంతో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. గజల్స్ ని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం ఏమైనా ప్రయత్నిస్తోంది. ఈ కారణంతోనే మంత్రి మాణిక్యాల రావుని రంగంలోకి దింపిదా.. ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.