వైరల్ : అదా.. యోగా డే వీడియో !
పొడుగుకాళ్ల సుందరి అదా శర్మ అభిమానులని మరోసారి సప్రైజ్ చేసింది. కాదు.. కాదు.. ఈ సారి చీటింగ్ చేసింది. ‘యోగా డే’ సందర్భంగా అదా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో బెడ్ పై పడుకున్న అదా.. ఒళ్లుని విల్లువా వచ్చింది. అరె.. అదా అద్భుతంగా చేసింది అనుకునేలోపు షాక్ ఇచ్చింది. అదా వెనకాల ఆమె అమ్మ ఉంది. ఆమె కాళ్లతోనే అదా.. ఈ ఫిటెనెస్ వీడియో చేసింది. మొత్తానికి.. ఈ వీడియో సరదాగా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అదా చేతిలో తెలుగు సినిమాలేమీ లేవు. ఒకట్రెండు వెబ్ సిరీస్ లు చేసేందుకు రెడీ అవుతునట్టు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తోంది. ఇక ఖాళీ సమయాల్లో ఆసక్తికర వీడియాలతో అభిమానులని ఎంటర్ టైన్ చేస్తోంది.
Extreme yoga ! With my mamma 🤣😁 #Internationalyogaday2020 pic.twitter.com/P2z8CBCMta
— Adah Sharma (@adah_sharma) June 21, 2020