వైరల్ : రానా-మిహీకా వెడ్డింగ్ ఫోటో షూట్ ఫోటోస్


దగ్గుబాటి ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మ్రోగనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 8న రానా-మిహీకా బజాజ్ లు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. హైదరాబాద్ ఫలక్ నూమా ప్యాలేస్ లో వీరి పెళ్లి వేడుక జరగనుంది. తాజాగా ఇద్దరికీ ఫొటోషూట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తీసిన ఫొటోల్ని మిహీకా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పుడీ ఫోటోలు వైరల్ అవుతున్నాయ్. మిహీకా బ్యూటీఫుల్ గా ఉన్నావని కామెంట్స్ పెడుతున్నారు.  

ఆగస్టు 8న హైదరాబాద్‌లో రానా-మిహీకాల పెళ్లి జరగనుంది. వివాహానికి రెండు రోజుల ముందు ఆగస్టు 6, 7న మెహెందీ, సంగీత్ కార్యక్రమాల్ని నిర్వహించబోతున్నట్లు సమాచారం. తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం పెళ్లితంతు జరగనుందట. కరోనా పరిస్థితుల కారణంగా నిబంధనల మేరకు వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.