హరీష్.. నీవు తోపు అబ్బా.. !!
మెగా అభిమానుల నాడి దర్శకుడు హరీష్ శంకర్ ని తెలిసినంత మరే దర్శకుడికి తెలియదేమో.. ! పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్ని సినిమాలు తీయని. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టని. ‘గబ్బర్ సింగ్’ సినిమాని మించిన సినిమా అనిపించుకోదు. అంతలా మెగా అభిమానులని అలరించిన సినిమా. మాస్ ని మురిపించిన సినిమా. పవన్ అభిమాని కాదు.. భక్తుడు సినిమా తీస్తే ఎలా ఉంటది అంతే.. ‘గబ్బర్ సింగ్’ ని చూస్తే అర్థమవుతోంది.
గబ్బర్ సింగ్ తర్వాత కూడా మరో మూడు సార్లు మెగా అభిమానులని మురిపించాడు. మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ తో ‘సుబ్రమణ్యం ఫస్ సేల్’ తీశాడు. స్టయిలీ స్టార్ అల్లు అర్జున్ తో ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్’ తీశాడు. ఇప్పుడీ సినిమా మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. తన జీవితంలో గుర్తుండిపోయే చిత్రంగా చేసిన చిత్రబృందానికి, ముఖ్యంగా నా ఆర్మీకి ప్రత్యేక కృతజ్ఞతలని బన్నీ అన్నారు.
ఇక ‘గద్దలకొండ గణేష్’తో వరుణ్ తేజ్ కి మాస్ హిట్ ఇచ్చాడు హరీష్ శంకర్. అప్పటి వరకు క్లాస్ హీరోగా పేరుతెచ్చుకున్న వరుణ్ తేజ్ లోని మాస్ యాంగిల్.. ఊరమాస్ ని బయటికి తీసుకొచ్చాడు. వరుణ్ తేజ్ ఎన్నిసినిమాలు చేసినా.. గద్దలకొండ గణేష్ ని ఆయన అభిమానులు మరిచిపోలేరు. ఈ లెక్కన.. హరీష్ శంకర్ తోపు అని చెప్పవచ్చు. మెగా అభిమానులు ఎప్పుడు డిసపాయింట్ లో ఉన్నా.. హరీష్ శంకర్ ఉన్నాడు. ఆ ధైర్యంతో ఉండండి. మరిన్ని బ్లాక్ బస్టర్స్ ఇస్తాడు.
3 years of DJ ! Thank you @harish2you garu for all the entertainment on & off the screen . Spl Thanks to Dil Raju garu , @hegdepooja , my Friend @ThisIsDSP n many more. One of my most memorable film . I thank all the cast , crew and audience of DJ & most importantly My Army 🖤 pic.twitter.com/EglocMMGD1
— Allu Arjun (@alluarjun) June 23, 2020