గజల్స్’పై మంత్రి మాట మారింది.. !
గజల్ శ్రీనివాస్ పై కుట్రకోణం ఉందంటూ ఆయన్నుసమర్థిస్తూ మాట్లాడిన ఏపీ మంత్రి మాణిక్యాలరావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. గజల్ శ్రీనివాస్ ను సమర్దిస్తూ తాను చేసినవ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నానంటూ ప్రకటించారాయన. తన వ్యాఖ్యలపై కొందరు తనను కలిసి అతని వీడియోలు చూపించారని, ఆ విడియోలు చూసి తాను షాకయ్యానని ఆయన అన్నారు.
తాను మాట్లాడిన దానికి సిగ్గుపడుతున్నానని ఆయన చెప్పారు. గజల్ శ్రీనివాస్ లో ఇన్నాళ్లు నాణానికి ఓ వైపే చూసానని, ఈ విధంగా ప్రవర్తించే వ్యక్తని అనుకోలేదని ఆయన అన్నారు. ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదని, గజల్ శ్రీనివాస్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి మాణిక్యాలరావు.