స్లిమ్’గా మారిన లేడీ కమెడియన్


బొద్దుగా, ముద్దుగా ఉండే లేడీ కమెడియన్ విద్యుల్లేఖా రామన్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తోంది. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోంది బిజీగా గడుపుతోంది. అయితే కరోనా లాక్‌డౌన్ తో దొరికిన ఖాళీ సమయాన్ని విద్యుల్లేఖా సద్వినియోగం చేసుకుంది. బరువు తగ్గింపై పోకస్ పెట్టింది. బాగా సన్నబడింది. దానికి సంబంధించిన ఫోటోలని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.

‘తాను పదో తరగతిలో ఉన్నప్పడు నా బరువు 68.2కేజీలు. ఇప్పుడు కూడా ఆ బరువుకి తగ్గాను. ఎంతో కఠోర శ్రమ వలన ఇది సాధ్యమైంది. నా ఆహారపు అలవాట్లు లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చుకోవడం వలన బాగా తగ్గాను. మన మనస్సులో ఏదైన గట్టిగా తలచుకుంటే అది తప్పక సాధ్యమవుతుంది. అధిక బరువు ఉన్నప్పుడు నువ్వు ఇంత కాన్ఫిడెంట్‌గా ఎలా ఉన్నావు అనే ప్రశ్న తరచు ఎదురయ్యేది. ఇప్పుడు చూస్తే అప్పుడు నిజంగా కాన్ఫిడెంట్‌గా ఉన్నానా అని అనిపిస్తుంది’ అని విద్యుల్లేఖా అన్నారు.