సిరిసిల్లలో రైతు బజారుని ప్రారంభించిన కేటీఆర్
సిరిసిల్లలో సుమారు రూ.ఐదు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక రైతు బజారును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘చిరువ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా బజారులో అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. సుమారు రూ.ఐదు కోట్ల వ్యయంతో ఈ రైతు బజారు ఏర్పాటైంది. 223 మంది ఏకకాలంలో వ్యాపారం చేసుకునేలా ఈ రైతు బజారు నిర్మించామన్నారు.
కరోనా సంక్షోభంలోనూ రైతులను మరువకుండా 5.6 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని కేటీఆర్ అన్నారు. సాగు, తాగు నీటి రంగంలో దేశం మొత్తం అబ్బురపడే విధంగా తెలంగాణలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాలంతో పోటీపడుతూ కాళేశ్వరం నిర్మించుకున్నాం. రాష్ట్రాన్ని సాధించుకోవడం, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ లాంటి దమ్ము, దక్షత ఉన్న నాయకుడు ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు కేటీఆర్.
సిరిసిల్ల పట్టణంలో రైతు బజార్ ను ప్రారంభించిన మంత్రి శ్రీ కేటీఆర్ గారు..@KTRTRS pic.twitter.com/4qO9F4upoZ
— Thirupathi bandari (@BTR_KTR) June 23, 2020