నటులు ఎంటర్ టైనర్లు మాత్రమే.. వారే రియల్ హీరోస్ !
‘నటులు ఎంటర్ టైనర్లు మాత్రమే. పోలీసులు, ఆర్మీ అధికారులు మాత్రమే రియల్ హీరోలు. భవిష్యత్ తరాలకి ఇదే నేర్పాలి’ అన్నారు బాలీవుడ్ నటుడు, మాజీ బీజేపీ ఎంపీ పరేశ్ రావల్. గత సోమవారం గల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగ తెలిసిందే. తాజాగా నవాన్ల మరణంపై పరేశ్ రావల్ స్పందించారు.
యాక్టర్లను కేవలం ఎంటర్ టైనర్లు అని పిలవాలలి. మన ఆర్మీ, పోలీసు అధికారులను హీరోలు అని పిలవాలి. మన తర్వాతి జనరేషన్లు హీరోస్ అనే పదానికి నిజమైన అర్థం తెలుసుకోవాలని సూచించారు పరేశ్ సూచించారు. ఇప్పటి జనరేషన్ నటీనటులనే రియల్ హీరోలుగా చూస్తుండటం, వారిని అనుకరించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పరేశ్ రావల్ వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయ్. అయితే కరోనా విజృంభిస్తున్న కఠిన సమయంలో కొందరు రీల్ హీరోలు అనిపించుకున్నారు. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సోనూసూద్ పేదలకి అండగా నిలిచి గొప్ప మనసు చాటుకున్నారు.