అడ్డంగా దొరికిపోయిన నిమ్మగడ్డ
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్న్ అడ్డంగా దొరికిపోయారు. హైదారాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో బీజేపీ ఎంపీ సుజనా, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తో నిమ్మగడ్డ చర్చలు జరిపారు. విడివిడిగా హోటల్ లోకి వెళ్లిన ఈ ముగ్గురు.. ఓ గదిలో గంటకుపైగా చర్చలు జరిపారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోని వైసీపీ విడుదల చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక తెదేపా అధినేత చంద్రబాబు ఉన్నాడని రుజువైందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు.
సుజానా బీజేపీ ఎంపీనే అయినా.. ఆయన ఇంకా టీడీపీ మద్దతుదారుడేనని చెబుతారు. కామినేని కూడా అంతే. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ వెనక చంద్రబాబు ఉన్నాడని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు నిమ్మగడ్డకు భాజాపా మద్దతు ఉందని చెబుతున్నారు. ఇప్పటికే నిమ్మగడ్డ వ్యవహారంపై కామినేని మూడు సార్లు హైకోర్టుకు వెళ్లారు. అది కూడా అధిష్టానం అనుమతితోనే వెళ్లామని చెప్పారు.
ఈ వ్యవహారంలో రెండు విషయాలు షాక్ ని కలిగిస్తున్నాయ్. ఎన్నికల కమిషనర్ ఉన్న నిమ్మగడ్డ.. రాజకీయ నేతలతో కలవకూడదు. మరోటి స్టార్ హోటల్ పార్క్ హయత్ నుంచి వీడియో క్లిప్ ఎలా బయటికొచ్చింది ? అన్నది తెలియాల్సి ఉందే. బిగ్ షాట్స్ వచ్చే ఈ హోటల్ నుంచి ఓ వీడియో బిట్ బయటికి రావడం అంటే చిన్ని విషయం కాదని చెప్పవచ్చు. మొత్తానికి.. నిమ్మగడ్డ వ్యవహారం వైసీపీకి ఓ అవకాశం లభించింది. దీనిపై వైసీపీ తప్పక రచ్చ చేస్తుందని చెప్పవచ్చు.
CCTV of a 'secret meeting' by AP SEC #NimmagaddaRamesh emerges where he's meeting #BJP leaders @yschowdary & Kamineni Srinivas at Park Hyatt in #Hyderabad on June 13. For someone holding a constitutional post, this has raised eyebrows esp when a case is sub-judice in SC. #YSRCP pic.twitter.com/Z65X1DN9O0
— krishnamurthy (@krishna0302) June 23, 2020