తెలంగాణ ఉద్యోగులకి గుడ్ న్యూస్
ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. జూన్ నెలకి సంబంధించి పూర్తి వేతనం చెల్లిస్తామని తెలిపింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మార్చి నెల నుంచి ఉద్యోగుల జీవితాల్లో కోత విధిస్తూ వస్తోంది ప్రభుత్వం. వైద్యులు, పోలీసులు, స్వచ్ఛ కార్మికులు, విద్యుత్ శాఖ ఉద్యోగులకి తప్ప.. మిగితావారి జీతాల్లో కోత విధించింది. అయితే జూన్ నెలకు సంబంధించి ఉద్యోగులకి పూర్తి జీతం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనిపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా నిర్ణయంపై ఉద్యోగులు సీఎం కేసీఆర్ కు కృతజ్ఝతలు తెలిపారు. సీఎంకు ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి నేతలు కారం రవీందర్ రెడ్డి, మమత, మామిళ్ళ రాజేందర్, జ్ఞానేశ్వర్, పద్మాచారి, మణిపాల్ రెడ్డి, మధుసూధన్ రెడ్డి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా ప్రభావం తగ్గాక.. సీఎం కేసీఆర్ ని కలిసి ఉద్యోగుల సమస్యలని వివరిస్తామని వీరు అన్నారు. పదవీవిరమణ వయోపరిమితి పెంపు, వేతన సవరణ వంటి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాని భావిస్తున్నారు.