26 నుంచి బెజవాడ పూర్తిగా లాక్‌డౌన్

తెలుగు రాష్ట్రాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏపీలో ప్రతిరోజూ నమోదవుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య 400-500 ఉంటున్నాయి. ఇక తెలంగాణలో మాత్రం ఆ సంఖ్య 800పైగా నమోదవుతున్నాయ్. మంగళవారం ఒక్కరోనే తెలంగాణలో 879 కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా కట్టడి విషయంలో తెలంగాణ కంటే బెటర్ గా ఏపీ కసరత్తులు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

కరోనా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఏపీ ప్రభుత్వం పూర్తి  లాక్‌డౌన్ ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.  కరోనా ప్రభావం అధికంగా ఉన్న మూడు జిల్లాలలోని (ప్రకాశం జిల్లా, అనంతపురం, శ్రీకాకుళం) కొన్ని ప్రాంతాల్లో పూర్తి లాక్‌డౌన్ విధించింది. ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లు, ఒంగోలు, చీరాల, పలాసలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తూ ఆయా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.

తాజాగా విజయవాడలోనూ ఈ నెల 26 నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తూ జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఆరు రోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగుతుందని.. ఈ రెండ్రోజుల్లో నిత్యవసర సరుకులు కొనుగోలు చేసి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మెడికల్ షాపులు, కొన్ని అత్యవసర షాపులు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు.