డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పదో తరగతి పరీక్షలని రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, డిగ్రీ మొదటి, రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులను ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ రద్దు నేపథ్యంలో గ్రేడింగ్ లేదా మార్కులపై నిర్ణయం నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఢిగ్రీ, పీజీ పరీక్షలని రద్దు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారమ్. ఇప్పటికే పదో తరగతి పరీక్షలని రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇంటర్నల్ మార్కుల ఆధారంగా రిజల్ట్ ని ప్రకటించింది. గ్రేడ్ లని కేటాయించింది. ఆన్ లైన్ లో ఫలితాలని ఉంచింది. ఇక డిగ్రీ, పీజీ పరీక్షలపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకొంది. పరీక్షల రద్దుకే ప్రభుత్వం మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది.