కరోనా ఎఫెక్ట్.. వ్యవసాయం చేసుకుంటున్న హీరో !

కరోనా లాక్‌డౌన్ తో సినీ తారలు ఇంటికే పరిమితయ్యారు. ఈ ఖాళీ సమయంలో నచ్చిన పనులు చేసుకుంటున్నారు. కొత్త పనులు నేర్చుకుంటున్నారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ మాత్రం రైతుగా మారారు. ఓ సాధారణ వ్యక్తిలా.. తన సొంత ఊరిలో వ్యవసాయం చేస్తున్నారు.

నవాజుద్దీన్ లాక్‌డౌన్‌ ఆరంభంలో  ముంబయిలోని తన ఇంట్లోనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలం బుధానాకు తల్లి, సోదరుడితో కలిసి వెళ్లారు. ఇటీవల నవాజుద్దీన్‌ సోదరి క్యాన్సర్‌తో మృతి చెందారు. దీంతో ఆయన తల్లి ఆరోగ్యం మందగిస్తోందని నటుడి సోదరుడు షమాస్‌ తెలిపారు. ఆమె కోసమే నవాజుద్దీన్‌ సొంత గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అక్కడే నవాజుద్దీన్ వ్యవసాయం చేస్తున్నారు.

దీనికి సంబంధించిన వీడియోని నవాజుద్దీన్ తన‌ ట్విటర్ ఖాతాలొ ‌లో పోస్ట్‌ చేశారు. ‘ఈరోజుకి పూర్తయింది..’అని క్యాప్షన్‌ ఇచ్చారు. అందులో ఆయన పచ్చని పొలాల మధ్య పని పూర్తి చేసుకున్న తర్వాత అక్కడున్న కాలువలోని నీటితో చేతులు శుభ్రం చేసుకుంటూ కనిపించారు. తలకు కండువా కట్టుకుని.. భుజంపై పార పెట్టుకున్నారు. ప్రస్తుతం నవాజుద్దీన్ బంగ్లాదేశ్‌ ఫిల్మ్‌మేకర్‌ ముస్తఫా సర్వార్‌ ఫరూకీ తెరకెక్కిస్తున్న’నో ల్యాండ్‌ మెన్’సినిమాలో నటిస్తున్నారు.