పతంజలి కరోనా మందుకు ఆయుష్ షాక్


కరోనా వైరస్ కు తొలి ఆర్వేదిక్ మందు వచ్చేసింది. కరోనాకి ఆయుర్వేద ఔషధం కనుగొన్నామన్న పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటించింది. ‘కరోనిల్’ పేరిట మందుని విడుదల చేసింది. హరిద్వార్‌లోని యోగ్‌పీఠ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రామ్ దేవ్ బాబా ఈ మందును ఆవిష్కరించారు. అయితే పంతంజలి కరోనా మందుని విడుదల చేసిన కొన్ని గంటల్లోనే కేంద్రం షాక్ ఇచ్చింది. ఔషధానికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది. తమ మందుతో ఏడు రోజుల్లో కరోనా నుంచి విముక్తి కలిగిందన్న ప్రకటనలు ప్రచారం చేయొద్దని ఆదేశించింది.

ఫలితాలను పూర్తి స్థాయిలో పరిశీలించి, విశ్లేషించేంత వరకూ ఆగాలని సూచించింది. ఈ మందులో ఉపయోగించిన మూలకాల పరిమాణాలు, ప్రయోగ ఫలితాలు, ఆస్పత్రుల్లో జరిపిన క్లినికల్ ట్రయల్స్ వివరాలను సమర్పించాలంది. క్లినికల్ ట్రయల్స్ కోసం ఆ సంస్థ నమోదు చేసుకుందా, నైతిక నియమావళి కమిటీ అనుమతుల వివరాలను కోరింది.