జులై 31 వరకు స్కూల్స్ బంద్

కరోనా కారణంగా విద్యాసంస్థలన్నీ బంద్ అయిన సంగతి తెలిసిందే. వేసవి సెలవులు ముగిసినా.. ఇప్పట్లో విద్యా సంస్థలు తెరచుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, కళాశాలలను ఇప్పట్లో తెరవ కూడదనీ.. జులై 31 వరకు మూసే ఉంచాలని నిర్ణయించింది.

ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ వెల్లడించారు. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలన్నీ జులై 31వరకు మూసే ఉంటాయని ఆయన స్పష్టంచేశారు. గతంలో జూన్‌ 30 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించగా.. ఇప్పుడా గడువును మరో నెలపాటు పొడిగించింది. ఇక గడిచిన 24గంటల్లోనే బెంగాల్‌లో కొత్తగా 413 కేసులు నమోదయ్యాయ్. దీంతో అక్కడ కరోనా కేసుల సంఖ్య 14358కి చేరింది. మరో 569మంది కరోనాతో మృతిచెందారు.