మరో టీవీ నటుడికి కరోనా పాజిటివ్

సినిమా, సీరియల్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన సంగతి తెలిసిందే. అయితే ఒకట్రెండు చిన్ని సినిమాలు తప్ప పెద్ద సినిమాల షూటింగ్స్ ఏమీ మొదలు కాలేదు. అయితే టీవీ సీరియల్స్, టీవీ షోస్ షూటింగ్స్ మొదలైపోయాయ్. దీంతో బుల్లితెర ప్రేక్షకులకి ఎంటర్ టైన్ మెంట్ మొదలైంది. కొత్త ఏపీసోడ్స్ ప్రసారం అవుతున్నాయి.
 
ఇంతలో మరో షాక్ తగిలింది. షూటింగ్ లో పాల్గొంటున్న బుల్లితెర నటీనటులు కరోనా బారినపడితున్నారు. దాని కారణంగా సీరియల్స్ షూటింగ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. ఇటీవలే టీవీ నటుడు ప్రభాకర్ కి కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన నటిస్తున్న సీరియల్ షూటింగ్ రద్దయింది. తాజాగా హరికృష్ణ అనే టీవీ నటుడుకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన నటిస్తున్న గృహలక్ష్మీ సీరియల్ షూటింగ్ రద్దయింది.