గుడ్ న్యూస్ : ‘గూగుల్‌పే’ అప్పులు ఇవ్వనుంది
‘గూగూల్ పే’ గుడ్ న్యూస్ చెప్పింది. అతి త్వరలో కొత్త ఫీచర్ ని తీసుకొస్తున్నాం. ఆ ఫీచర్ ద్వారా అప్పులిస్తామని గూగుల్ పే ప్రకటించింది. అతి తక్కువ వడ్డీలకే ఇన్‌స్టంట్ లోన్స్ ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. కేవలం ఒక్క క్లిక్‌తో రుణాలు నేరుగా ఖాతాలో జమ చేసే విధంగా ఫీచర్ రూపొందిస్తున్నట్టు ప్రకటించింది.
దీని కోసం కొన్ని బ్యాంకులతో ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధమైనట్టు సమాచారం. యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఫెడరల్, కోటక్ మహీంద్రా బ్యాంకులతో ఒప్పందం కూడా కుదిరింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ ఫీచర్ అందుబాటులోకి రాగానే మొదటి దశలో 30 లక్షల మంది వరకూ లోన్స్ ఇవ్వనున్నారట. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అప్పులు ఇవ్వనుందని తెలిసింది.