తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టెస్టులకి బ్రేక్

ప్రయివేటు ఆసుపత్రల్లోనూ కరోనా టెస్టులకి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ధరలని కూడా ప్రభుత్వమే నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలు, ఐసీఎంఆర్ నిబంధనలు పాటిస్తూ కరోనా టెస్టులు చేయాలని సూచించింది. కానీ ప్రయివేటు ఆసుపత్రుల్లో ఏమాత్రం నిబంధనలు పాటించడం లేదని ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీ విచారణలో తేలింది. దీంతో ప్రయివేటు ఆసుపత్రుల్లో కరోనా టెస్టులని నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ప్రయివేటు ఆసుపత్రుల్లో కరోనా టెస్ట్ రిపోర్టుని తప్పుగా ని ఇస్తున్నారు. నెగటివ్ వచ్చిన వారికి కూడా పాజిటివ్ ఇస్తున్నారని ఎక్స్ పర్ట్ కమిటీ నివేదికలో తేలింది. మొత్తం మొత్తం 16 ల్యాబుల్లో ఇన్‌‌స్పెక్షన్ చేసి, చాలా అవకతవకలను గుర్తించినట్టు వివరించింది. రూల్స్ బ్రేక్ చేసిన ల్యాబ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. ప్రయివేటు ల్యాబుల్లో ఐసీఎంఆర్ నిబంధనలని, ప్రభుత్వ ఆదేశాలని ఏమాత్రం పాటించడం లేదని కమిటీ పేర్కొంది. అంతేకాదు.. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని తెలిపింది. కరోనా భయంతో ప్రజలు లక్షణాలు లేకున్నా ఆసుపత్రులకి వస్తున్నారు. వారి భయాన్ని ప్రయివేటు ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయని కమిటీ నిర్థారించింది. ఈ నేపథ్యంలోనే ప్రయివేటు ఆసుపత్రుల్లో టెస్టులకి బ్రేక్ వేశారు.