అప్పుడు గెలికాడు.. ఇప్పుడు పని చేసుకుంటున్నాడు !

విచిత్ర జీవి ఆర్జీవి. ఆయన సన్నిహితులు, శిష్యులు చెప్పే మాట ఇది. ఇదీ నిజం. ఇండస్ట్రీ బిజీగా ఉన్న సమయంలో.. అంటే కరోనాకి ముందు రామ్ గోపాల్ వర్మ ఖాళీగా ఉన్నారు. ట్విట్టర్ లో వారిని, వీరిని గెలికేవాడు. సంచలన ట్విట్లు చేసి కాలక్షేపం చేసుకొనేవాడు. అయితే కరోనా లాక్‌డౌన్ తో ఇండస్ట్రీ మొత్తం ఖాళీగా ఉంటుంది. కానీ వర్మ మాత్రం బిజీ అయిపోయారు. 

వరుసగా సినిమాలు చేస్తున్నారు. వాటిని ఓటీటీలో రిలీజ్ చేసి.. సొమ్ము చేసుకుంటున్నారు. కరోనాతో సినీ పరిశ్రమకి అష్టకష్టాలని సినిమా వాళ్లు తెగ బాధపడిపోతుంటే.. వర్మ మాత్రం మునుపటికంటే ఎక్కువగా పని చేస్తున్నాడు. అధికంగా సంపాదేస్తున్నారు. దీనికి కారణం ఆలోచనధోరణి. వర్మ నుంచి ఇప్పటికే క్లైమాక్స్ వచ్చేసింది. ఓటీటీలో రూ. 200పెట్టి మరీ.. ఈ సినిమాని చూశారు. ఈరోజు వర్మ నుంచి ‘నగ్నం’ రిలీజ్ కానుంది. ఇదీ పైసా వసూల్ చిత్రమే. ఇదీగాక దిశ, మర్డర్ సినిమాలని రెడీ చేస్తున్నారు వర్మ. భవిష్యత్ ఓటీటీదే ప్రేక్షకులు దానికి అలవాటు అయిపోయారు. దర్శక-నిర్మాతలు కూడా ఓటీటీకి అలవాటు కావాల్సిందే. మరో ఆప్షన్ లేదు అంటున్నాడు వర్మ.