కరోనా చికిత్సలో మార్పులు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 16వేలకి పైగా కొత్త కేసులు నమోదయ్యాయ్. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సకి ఎప్పటికప్పడు కొత్త పద్దతులు సూచిస్తోంది కేంద్ర ఆరోగ్యశాఖ. దాని వలన కరోనా కేసుల సంఖ్యని భారీగా తగ్గించవచ్చని భావిస్తోంది.

కరోనా చికిత్స విషయంలో ఢిల్లీ సీఎం క్రేజీవాల్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కంటోన్మెంట్ జోన్లలోని ప్రతి ఇంటికి వెళ్లి కరోనా టెస్టులు చేస్తామని క్రేజీవాల్ తెలిపారు. దీంతో పాటు ఇంట్లోనే కరోనా చికిత్సకి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారు హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటే సరిపోతుందని క్రేజీవాల్ తెలిపారు.

‘టెస్ట్ ట్రేస్ ట్రీత్’ పద్దతిని పాటించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. వీలైనంత ఎక్కువ పరీక్షలు చేయడం వలన ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు, ప్లాస్ మా తెరపి మంచి ఫలితాలని ఇస్తుందని చెబుతున్నారు. కరోనా లక్షణాలు తక్కువగా ఉన్న వారికి ప్లాస్ మా తెరపి మంచి ఫలితాలు ఇస్తుందని ఇప్పటికే రుజువైందని వైద్యులు చెబుతున్నారు. మొత్తానికి.. ఎప్పటికప్పుడు కొత్త పద్దలతో కరోనా చికిత్సకి కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు చేస్తోంది.