‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాపై సైబర్ కేసు
రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రం గురువారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. మంచి టాక్ తెచ్చుకొంది. ఓటీటీలో తొలి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇప్పుడీ సినిమా వివాదంలో చిక్కుకుంది. సినిమాపై సైబర్ కేసు నమోదైంది. రాకేష్ అనే వ్యక్తి ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాపై సైబర్ కేసు పెట్టారు.
సినిమాలోని ప్రధాన పాత్రలకి దేవుళ్ల పేరు పెట్టారని ఆయన ఫిర్యాదు చేశారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో సిద్దు ముగ్గురు హీరోయిన్‌లతో ప్రేమాయణం సాగిస్తాడు. ఆ ముగ్గురు హీరోయిన్ల పాత్రలకి దేవుళ్లపేర్లు పెట్టి రొమాన్స్ నడిపించినందుకు రాకేష్ ఫిర్యాదు చేశాడు.
ఈ చిత్రానికి రవికాంత్ పేరపు దర్శకత్వం వహించారు. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడు. శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వాడ్నికట్టి హీరోయిన్లుగా నటించారు. రానా దగ్గుబాటి చిత్రాన్ని సమర్పించారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఓటీటీలో మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.