గ్రీన్ ఛాలెంజ్’లో పాల్గొన్న బ్రహ్మానందం
తెలంగాణ ఎంపీ జోగినిపల్లి సంతోష్ తీసుకొచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ట్రెండ్ గా మారింది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, గోపీచంద్, వీవీ వినాయక్, యాంకర్ సుమ, అనసూయ, రష్మి తదితరులు గ్రీన్ ఛాలెంజ్ ని పూర్తి చేశారు.
తాజాగా సీనియర్ హాస్యనటుడు బ్రహ్మానందం గ్రీన్ ఛాలెంజ్ ని పూర్తి చేశారు. యాంకర్ ఉదయభాను బ్రహ్మీకి గ్రీన్ ఛాలెంజ్ ని విసిరింది. తాజాగా ఆ ఛాలెంజ్ ని బ్రహ్మీ పూర్తి చేశారు. దానికి సంబంధించిన పోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల కాలంలో బ్రహ్మీ సినిమాలు చేయడం బాగా తగ్గించేసిన సంగతి తెలిసిందే.