పవన్’ని సీఎం చేసిన వర్మ


జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఖుషి అయ్యే కామెంట్ చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. పవన్ కాబోయే సీఎం అన్నారు వర్మ. కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ వర్మ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తాజా చిత్రం ‘నగ్నం’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శుక్రవారం ఓ టీవీ ఛానెల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు వర్మ. కరోనా ప్రభావం, ఓటీటీ, రాజకీయాలు, సినిమాలపై స్పందించారు.

పవన్ గురించి ఒక్క మాటలో చెప్పామని అడిగితే.. ‘వెరీ టఫ్.. యూనిక్.. వన్ పీస్’ అంటూ పొగిడేశారు. వరల్డ్‌లో పవన్ ఓన్లీ వన్ పీస్ అని ప్రశంసించారు. పవన్ కాబోయే సీఎం అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ బెటర్ థాన్ సీనియర్ ఎన్టీఆర్ అంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరీ.. పవన్ విషయంలో వర్మ అంచనాలు నిజమవుతాయా ? అన్నది చూడాలి.