వైరల్ : ఐక్యరాజ్యసమితి కారులోనే శృంగారం

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కారులోనే శృంగారం మునిగిపోయింది.. ఓ జంట. అది కూడా సామాన్యుల కారు కాదు. ఐక్యరాజ్యసమితి చెందిన అధికారిక కారులో. ఏకంగా ఇజ్రాయెల్‌లో ఐక్యరాజ్య సమితికి చెందిన అధికారిక కారులో ఓ జంట శృగారం కొనసాగించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రెడ్ డ్రెస్‌లో ఉన్న ఓ మహిళ.. కారు వెనుక సీట్లో ఉన్న వ్యక్తి ఒడిలో కూర్చొని శృంగారానికి పాల్పడుతోంది. టెల్ అవీవ్ నగరంలోని ఓ ప్రధాన మార్గంలో కారు కదులుతున్నప్పటికీ వారిద్దరూ రాసలీలలు సాగించడం వీడియో చూడవచ్చు. కారు నంబర్ ప్లేట్, దాని పై భాగాన UN అనే అక్షరాలు కనిపించాయి. యునైటెడ్ నేషన్స్ ట్రూస్ సూపర్‌విజన్ ఆర్గనైజేషన్‌ (యూఎన్‌టీఎస్ఓ)కు చెందిన సిబ్బంది ఈ పనికి పాల్పడింది. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి సీరియస్ అయింది. దీనిపై విచారణ చేపట్టామని.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.