సెహ్వాగ్‌ ఇంటిపై మిడతల దండు (వీడియో)

పంటలను నాశనం చేసే మిడతల దండు ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌కు చేరుకుంది. మిడతలు గురుగ్రామ్‌నే కాకుండా ఢిల్లీ పరిసర ప్రాంతాలను చుట్టుముట్టాయి. దీంతో అవి సెహ్వాగ్‌ ఇంటివైపు కూడా వెళ్లాయి. ఆకాశంలో గుంపుగా విహరిస్తున్న మిడతల దండును సెహ్వాగ్‌ వీడియోగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేశాడు.

ఢిల్లీ-గురుగ్రామ్‌ సరిహద్దు ప్రాంతంలో రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న మిడతలు ఇంకా దిల్లీలోకి ప్రవేశించలేదు. మిడతలు ప్రస్తుతం రాజధాని వైపు వెళ్లే అవకాశం లేదని అధికారులు తెలిపారు. గురుగ్రామ్‌లో మిడతల దాడి పరిస్థితులపై చర్చించేందుకు ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. ఢిల్లీలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఇలాంటి సమయంలో మిడతల రూపంలో దేశ రాజధాని మరో సమస్య వచ్చిపడినట్టయింది.

View this post on Instagram

Locusts attack , right above the house #hamla

A post shared by Virender Sehwag (@virendersehwag) on