కరోనా కేసుల సంఖ్య చూసి భయపడొద్దు

కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం శనివారం నాటికి దేశంలో కేసుల సంఖ్య 5,08,953గా ఉంది. మరణాల సంఖ15,685కి చేరింది. అయితే కరోనా కేసుల అంకెలని చూసి భయపడాల్సిన పనిలేదని నిపుణులు అంటున్నారు. శనివారం కొవిడ్‌-19కు సంబంధించి ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దీనిలో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌ జైశంకర్‌, పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హర్షవర్ధన్‌ మాట్లాడుతూ ”దేశంలోని ఐదు లక్షల కేసుల్లో..యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,97,387 మాత్రమేనని అయన గుర్తుచేశారు. అంతేకాకుండా.. 2,95,880 మంది చికిత్సానంతరం ఆరోగ్యవంతులయ్యారు. భారత్‌ కొవిడ్‌ రికవరీ రేటు 58.13 శాతంగా ఉంది. అంటే వ్యాధి సోకిన ఐదు లక్షల మందిలో సుమారు మూడు లక్షల మంది విజయవంతంగా కోలుకున్నారు. ఇక మరణాల సంఖ్య 3 శాతం కంటే తక్కువగా ఉంది. కేసులు రెట్టింపయ్యే కాలం కూడా 19 రోజులుగా ఉండటం ఓ మంచి పరిణామం. కాగా ఇది లాక్‌డౌన్‌కు ముందు మూడు రోజులుగా ఉండేది. కరోనా కేసుల సంఖ్యని చూసి భయపడొద్దు” అన్నారు.