బ్రేకింగ్ : 15రోజుల పాటు హైదరాబాద్ లాక్‌డౌన్

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. 15రోజుల పాటు హైదరాబాద్ లో లాక్‌డౌన్ విధించే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ నే తెలిపారు. హైదరాబాద్ లో ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయం వద్దని.. అందరికీ సరైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

దేశవ్యాప్తంగా పెద్ద నగరాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న క్రమంలో.. హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి ఉండటం సహజం అన్నారు సీఎం కేసీఆర్. అయితే చెన్నైలో వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టారు.హైదారాబాద్‌లో కూడా 15 రోజులు లాక్‌డౌన్ విధించడం మంచిదని, వైద్యశాఖ నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి. మూడ్నాలుగు రోజుల్లో కేబినేట్ మీటింగ్ పెట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల్ని సన్నద్ధం చేయాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో మరోసారి హైదరాబాద్ లో సంపూర్ణంగా లాక్‌డౌన్ కాబోతుందని క్లారిటీ వచ్చింది.

మరోవైపు హైదరాబాద్ లో వ్యాపారులు స్వచ్చంధంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. ఇప్పటికే జనరల్ బజార్, భేగం బజార్, సూర్యా టవర్స్, ప్యారాడైస్, చార్మినార్, సిద్ది అంబర్ పేట వ్యాపారులు స్వచ్చంధంగా లాక్‌డౌన్‌ ని అమలు చేస్తున్నారు.