సీబీఎస్ఈ 30శాతం సెలబస్ తగ్గింపు
కరోనా ఎఫెక్ట్ తో విద్యాసంస్థలన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. వార్షిక పరీక్షలు కూడా రద్దవుతున్నాయ్. ఈ యేడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలుకానుంది. సెప్టెంబర్ తర్వాతే క్లాసులు ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో 30శాతం సెలబస్ ని తగ్గించాలని నిర్ణయించింది.
ఆదివారం నిర్వహించిన ఓ వెబ్ నార్ లో సెలబస్ తగ్గింపుపై సీబీఎస్‌ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి ప్రకటన చేశారు. 30శాతం సెలబస్ తగ్గించాలని ప్రాథమికంగా నిర్ణయించాం. దీనిపై జులై 15లోగా ప్రకటన చేసే అవకాశాలున్నాయి. సెలబస్ తగ్గింపుతో పాటు మార్పులు చేయనున్నట్టు త్రిపాఠి తెలిపారు. ప్రాక్టికల్స్‌ను విద్యార్థులు ఇంటి వద్దనే చేసేలా మార్పు చేస్తారని తెలుస్తోంది. ఆన్‌లైన్ తరగతులకు సంబంధించి మార్గదర్శకాలని కూడా విడుదల చేయనున్నారు.