ఓంకార్’పై కరోనా కుట్ర
కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సామాన్యులు, సెలబ్రిటీలు కరోనా బారినపడుతున్నారు. అయితే కరోనాతో ప్రతీకారం తీర్చుకొనేందుకు సినీ పరిశ్రమలో ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారమ్. లెటెస్ట్ గా దర్శకుడు ఓంకార్ కి కరోనా సోకింది అనే ప్రచారం జరుగుతోంది. వైరిపక్షం ఓంకార్ ప్రోగ్రామ్ లను దెబ్బకొట్టడానికి, ఛానెల్ రేటింగ్ లు పడిపోయేలా చేయడానికే ఈ అసత్య ప్రచారం స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.
ఓంకార్ కి కరోనా అనే న్యూస్ వైరల్ అవ్వడంతో.. దీనిపై ఓంకార్ ఫ్యామిలీ స్పందించింది. ఓంకార్ బాగానే ఉన్నారు. ఆయనకి కరోనా సోకలేదు. టెస్టులు చేయించుకుంటే నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. అందుకే ఆయన షూటింగ్ లలో పాల్గొంటున్నారని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. అసలు ఈ ప్రచారం ఎలా పుట్టించుకొచ్చింది ? అని ఆరాతీస్తే.. గతంలో ఓంకార్ ప్రోగ్రామ్ తో పోటీపడి ఇబ్బంది పడినవారని తేలింది. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కి ఫోన్ చేసి.. ఇలా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారట. మొత్తానికి మహమ్మారి కరోనాని ప్రత్యర్థులమీద ప్రతీకారం తీర్చుకోవడానికి వాడుకుంటున్నారు.