మందుబాబుల ముందు జాగ్రత్త చూశారా ?
లాక్ డౌన్ సమయంలో మద్యం దొరక్క మందుబాబులు గిలగిల కొట్టుకున్నారు. పిచ్చోళ్లయ్యారు. పిచ్చాసుపత్రుల్లో చేరారు. అయితే మరోసారి లాక్ డౌన్ అనగానే మందుబాబు ముందు జాగ్రత్త పడుతున్నారు. తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో 15రోజుల పాటు హైదరాబాద్ లో సంపూర్ణ లాక్ డౌన్ విధించే ఆలోచనలో ఉన్నట్టు ఆదివారం సీఎం కేసీఆర్ తెలిపారు.
మూడ్నాలుగు రోజుల్లో కేబినేట్ సమావేశం నిర్వహించి హైదరాబాద్ లో లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటాం అన్నారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో మందుబాబులు అలర్ట్ అయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచే మద్యం షాపులకి పరుగులు తీస్తున్నారు. 20రోజులకి సరిపడ మందు బాటిల్స్ కొనుక్కొని పెట్టుకుంటున్నారు. ఇంట్లో మందుబాటిల్స్ ఉంటే.. ఎన్నిరోజులు లాక్ డౌన్ ఉన్నా… పర్వాలేదని మందుబాబులు భావిస్తున్నారు. మందు విషయంలో మాత్రమే కాదు.. మిగితా విషయంలోనూ ఇలాంటి జాగ్రత్త ఉంటే బాగుండేమో.. !