తరుణ్ భాస్కర్’ని తగులుకున్నారు !

పీకబోయి.. పీకించుకోవడం అంటే ఇదే. తాజాగా దర్శకుడు తరుణ్ భాస్కర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘కప్పెళ’ అనే మలయాళ సినిమాను పొగుడుతూ టాలీవుడ్ హీరోలని విమర్శించాడు.

‘హీరో గట్టిగా పిచ్చోడిలా రీసౌండ్ చేసుకుంటూ అరవడు. అందరి కంటే స్మార్ట్ గా ప్రతి డైలాగ్ లో సామెత చెప్పడు. ఎక్స్ ట్రీమ్ స్లో మోషన్ లో ఫిజిక్స్ ఫెయిల్ ఫైట్లు ఉండవు. ప్రతి 2 నిమిషాలకు హీరో రీఎంట్రీ ఉండదు. చివరి 10 నిమిషాల్లో ర్యాండమ్ గా రైతుల గురించో, సైనికుల గురించో, ఇండియా గురించో మెసేజ్ ఉండదు. కానీ దీన్ని కూడా ఆ ఊరిలో సినిమా అంటారు మరి’ అని రాసుకొచ్చాడు. దీంతో స్టార్ హీరోల ఫ్యాన్స్ తరుణ్ భాస్కర్ ని తగులుకున్నారు. ఫ్యాన్స్ గ్రూపుల్లో రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఎలాంటి సినిమాలు చూడాలో నువ్వు మాకు ఉచిత సలహాలివ్వక్కర్లేదంటూ ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు.