‘వకీల్‌సాబ్’ నుంచి మరో పిక్ లీక్ !

‘వకీల్‌సాబ్’ సినిమాతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ కీలక పాత్రల్లో బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం ‘పింక్‌’. 2016లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పింక్ తెలుగు రిమేక్ నే వకీల్‌సాబ్. ఇందులో అమితాబ్ పాత్రలో పవన్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ పిక్ లీకైంది. పవన్‌ ఇందులో లాయర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆయన కోర్టులో నల్లకోటు ధరించి వాదనలు వినిపిస్తున్న సన్నివేశానికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో నటి అంజలి కూడా ఉండటం విశేషం.’ వకీల్‌సాబ్’ టైటిల్‌లో కనిపించే పవన్‌ ఐకాన్‌ కూడా మొదటలీకైన సంగతి తెలిసిందే.