స్వయంతృప్తి పొందుతున్న తెలుగు హీరోయిన్
తెలుగమ్మాయి ఈషా రెబ్బాకు అన్నీ ఉన్నాయ్. అదృష్టం ఒక్కటే కరువైంది. అందుకే బిజీ హీరోయిన్ కాలేకపోతోంది. అయితే ఈషా మాత్రం ప్రయత్నాలేమీ ఆపడంలేదు. వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది. ఫోటో షూట్స్ తో పని కావడం లేదని ఈషా సంచలన వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
‘లవ్ స్టోరీస్’ హిందీ వెబ్ సిరీస్ ఎంత హిట్టయిందో తెలిసిందే. నలుగురు దర్శకులు ‘లస్ట్ స్టోరీస్’ పేరుతో నెట్ ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ రూపొందించారు. అందులో కియారా అద్వానీ హాట్ సీన్స్ నటించి సంచలనం సృష్టించింది. ఈ వెబ్ సిరీస్ తర్వాతే బాలీవుడ్ లో కైరా బిజీ అయింది. ఇందులో తన్మయత్వం పొందే ఓ సీన్ లో కైరా కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో హీటెక్కించింది.
ఇప్పుడు ఈ సంచలన వెబ్ సిరీస్ తెలుగులోకి రిమేక్ అవుతోంది. ఈ సిరీస్‌లో ఒక ఎపిసోడ్లో ఇషా రెబ్బా నటిస్తోంది. ఈ ఎపిసోడ్‌ను ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. హిందీలో కియారా చేసిన పాత్రనే తెలుగులో ఈషా చేస్తోంది. ఇప్పటికే ఆమె పాత్ర షూటింగ్ అయిపోయింది. స్వయంతృప్తి సీన్ లో ఈషా అదరగొట్టేసింది. ఈ వెబ్ సిరీస్ తర్వాత ఈషా బిజీ కావడం ఖాయమని చెప్పుకుంటున్నారు.