పెళ్లిలో కరోనా.. పెళ్లి కొడుకు మృతి !

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న దృష్ట్యా కేవలం శుభకార్యాల్లో 50మంది, అంత్యక్రియల్లో 20మంది మాత్రమే పాల్గొనాలని ప్రభుత్వం నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనలు ఉల్లఘించి ఘనంగా చేసుకున్న ఓ శుభకార్యం చివరకు విషాదాంతమైన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.పెళ్లి కుమారుడు మరణించడంతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న 110మందికిపైగా బంధువులకు కరోనా వైరస్‌ సోకింది.

పాట్నాకు సమీపంలోని పాలిగంజ్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ గుర్‌గావ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. జూన్ 15న అతని వివాహం బిహార్‌లో జరిగింది. అయితే, వివాహ తేదీ దగ్గరపడుతున్న సమయంలోనే అతనికి కొవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. చివరకు డయేరియాగా అనుమానించి పాట్నాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆ సమయంలో అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. అయినా వరుడి కుటుంబసభ్యులు ఒత్తిడి తెచ్చి యువకుడి వివాహం ఘనంగా జరిపించారు. చివరకు వివాహమైన రెండో రోజే పెళ్లి కుమారుడు మృత్యువాతపడ్డాడు. ఈ వేడుకకి హాజరైన  దాదాపు 110మందికి పైగా కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. పెళ్లి కుమార్తెకు మాత్రం వైరస్ సోకలేదు.