బుల్లితెర నటికి కరోనా

కరోనా లాక్‌డౌన్ కార‌ణంగా మార్చి చివ‌రి వారం నుంచి అన్ని ర‌కాల షూటింగ్‌లు బంద్ అయ్యాయి. ఇటీవ‌ల లాక్‌డౌన్ స‌డ‌లింపుల్లో భాగంగా తెలంగాణ స‌ర్కార్ షూటింగ్‌ల‌కు షరతులతో కూడిన అనుమతులిచ్చింది. దీంతో సీరియల్స్, టీవీషోస్ షూటింగ్స్, ఒకట్రెండు చిన్ని సినిమాల షూటింగ్స్ మొదలయ్యాయ్. అయితే సీరియల్స్ లో నటిస్తున్న నటీనటులు వరుసగా కరోనా బారినపడుతున్నారు.

బుల్లితెర న‌టుడు ప్ర‌భాక‌ర్ క‌రోనా బారిన ప‌డ్డాడు. ఇత‌ని కాంటాక్ట్‌లో ఉన్న మ‌రో బుల్లితెర న‌టుడు హ‌రికృష్ణ కూడా క‌రోనా బాధితుడ‌య్యాడు. తాజాగా బుల్లితెర హీరోయిన్ న‌వ్య‌సామి  కూడా కరోనా బారినపడినట్టు సమాచారమ్.’నా పేరు మీనాక్షి’ , ‘ఆమె కథ’ సీరియల్స్ లో హీరోయిన్‌గా అలరిస్తున్నారు నవ్యసామి. కొన్నిరోజులుగా క‌రోనా ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న ఈమెకు వైద్య ప‌రీక్షలు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల్లో క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయిన‌ట్టు స‌మాచారం.  దీంతో  న‌వ్య‌సామి ఎవ‌రెవ‌రిని కలిశార‌నే దానిపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఆమె నటిస్తున్న సీరియల్స్ షూటింగ్స్ కూడా వాయిదా పడినట్టు తెలుస్తోంది.