ICC ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకున్న శశాంక్‌ మనోహర్

ఐసీసీ ఛైర్మన్‌ పదవి ఖాళీ అయింది. శశాంక్‌ మనోహర్ ఐసీసీ చైర్మన్ పదవిని నుంచి‌ దిగిపోయారని ఐసీసీ ప్రకటించింది. మరొకరు ఎన్నికయ్యే వరకు ఆ బాధ్యతలను డిప్యూటీ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజా నిర్వహిస్తారని వెల్లడించింది. వారం రోజుల్లో కొత్త ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ ఆరంభమవుతుందని సమాచారం.

ప్రస్తుతం ఈసీబీ మాజీ ఛైర్మన్‌ కొలిన్‌గ్రేవ్స్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పోటీలో ఉన్నారు. ఏవరైనా సరే ఏకగ్రీవం కోసమే ప్రయత్నించే అవకాశముంది. ఇక ఇప్పటి వరకు గంగూలీ అభ్యర్థిత్వం గురించి బీసీసీఐ ఒక్కమాటా చెప్పలేదు. అనూహ్య పరిణామాలు జరిగితే దాదా ఐసీసీ ఛైర్మన్‌ పదవికి ఎంపికైనా ఆశ్చర్యం లేదు.