హరీష్ రివర్స్ ఎటాక్

కొండపోచమ్మ సాగర్‌ కాల్వకు గండిపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్, భాజాపా నేతలు భగ్గుమన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల్లో క్వాలీటీ లేదు. కమీషన్ల కోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి హరీష్ రావు రివర్స్ ఎటాక్ చేశారు. చిన్న కాల్వ తెగితే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టులు ఏకంగా కొట్టుకుపోయిన విషయం మరిచిపోవద్దని సూచించారు.

2007లో ఖమ్మం జిల్లా పాలెం వాగు ప్రాజెక్టు కొట్టుకుపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సిద్ధం కాకముందే కొట్టుకుపోయిందన్నారు. ఎల్లంపల్లి నిర్మాణంలో లోపం ఉందని కాంగ్రెస్‌ వదిలేసిందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. దేవాదుల ప్రాజెక్టు పైపులు పటాకులు లాగా పేలిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే అని మంత్రి అన్నారు. గుజరాత్‌లోని సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు కాల్వలకు 200 సార్లు గండిపడిన విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు.